మొత్తం మూడు వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ట్ చేసిన తాజా చిత్రం “సర్కారు వారి పాట”. ఈ ఏడాది పరిస్థితులు కనుక సక్రమంగా ఉన్నట్టయితే ఈ పాటికే ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం మొదలయ్యిపోయి ఉండేది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రం అతి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే.
కానీ అంతకు ముందే మహేష్ తన కుటుంబంతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసే ప్లాన్ వేశారు. ఇక అలాగే మరోపక్క మేకర్స్ కూడా సర్కారు వారి పాట షూట్ కు అదే యూఎస్ లో అంతా సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ సినిమా విషయంలో ఒక క్రేజీ గాసిప్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అదే మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని. ఒకటి అతి పెద్దే బిజినెస్ మ్యాగ్నెట్ అయితే మరొకటి పక్కా మాస్ రోల్.
ఇపుడు అందులో భాగంగానే మొదట స్టైలిష్ రోల్ షూట్ ను పూర్తి చేసే ప్లాన్ మేకర్స్ వేసారా అని టాక్ మొదలయ్యింది. అందుకే మొదట యూఎస్ లో ఆ రోల్ కు సంబంధించి షూట్ ను కంప్లీట్ చేసేసి మహేష్ ఇక్కడికి వచ్చాక ఆ మాస్ లుక్ లో కనిపించే రోల్ ను చేస్తారా అన్నది అసలు టాక్.
ఎలాగో ప్రీ లుక్ పోస్టర్ మరియు ఇప్పుడు మహేష్ ఉన్న క్లాసీ లుక్ ను చూస్తే అదే అనుకోవచ్చు. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో అన్నది చూడాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.