టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ మూవీ కొరకు హీరోని వెతికే పనిలో ఉన్నారు. గత ఏడాది ఆయన నుండి మెగాస్టార్ హీరోగా సైరా నరసింహారెడ్డి అనే భారీ పాన్ ఇండియా మూవీ వచ్చింది. ఈ చిత్రం తెలుగులో భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు కథలు వినిపించిన ఆయన బన్నీని కూడా కలవడం జరిగిందట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రేసు గుర్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు, బన్నీకి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చింది. ప్రస్తుతం సుకుమార్ తో బన్నీ మూవీ చేస్తుండగా సురేంధర్ రెడ్డి బన్నీని తన స్టోరీ లైన్స్ తో ఒప్పించే పనిలో ఉన్నారని టాక్. చూడాలి బన్నీ తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో లేదో.