“బిగ్ బాస్ 4” ఫినాలే ఆల్ టైం ఇండియన్ టీఆర్పీ రికార్డ్ ను బద్దలు కొడుతుందా?

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ ను తెచ్చుకొని దుమ్ము లేపింది. వరుసగా మూడు సీజన్లలో సత్తా చాటి నాలుగో సీజన్లో కూడా రెట్టింపు రెస్పాన్స్ తో అదరగొట్టింది. అయితే ఈ గ్రాండ్ షోకు మొట్ట మొదటి ఎపిసోడ్ అలాగే చిట్ట చివరి ఫినాలే ఎపిసోడ్ లు ఎంత కీలకమో తెలిసిందే.

అలా లాస్ట్ సీజన్ 3 కు గాను ఇండియాలోనే హిస్టారికల్ టీఆర్పీ వచ్చింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కు మెగాస్టార్ గ్రేస్ తోడయ్యేసరికి 18.3 భారీ రికార్డుతో ఆల్ టైం ఇండియన్ రికార్డుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ భాషలో కూడా ఫినాలే ఎపిసోడ్ కు ఈ స్థాయి రేటింగ్ వచ్చింది లేదు.

మరి ఈసారి సీజన్ 4 కు ఎలాంటి రేటింగ్ వస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. గత సీజన్ తో పోలిస్తే కంటెస్టెంట్స్ విషయంలో కాస్త తక్కువగా రీచ్ ఉన్నవారిని ఎంచుకోవడంతో మొదట్లో వీక్ ఎపిసోడ్స్ కు అంత రేటింగ్ రాలేదు.

కానీ మెల్లగా ఊపందుకోని వీక్స్ లో కూడా అదిరిపోయే రేటింగ్స్ ను రాబట్టింది. ఇక మరి అంతే కాకుండా ఇప్పుడు ఫినాలే రేస్ లో నిలబడ్డ కంటెస్టెంట్స్ లో కనీ వినీ ఎరుగని రీతి పోటీ నెలకొనడం గత సీజన్లో కంటే భారీ స్థాయి ఓటింగ్ నమోదు కావడంతో ఈ సీజన్ టీఆర్పీ మరింత స్పెషల్ గా నిలిచింది.

కానీ ఒక్క గెస్ట్ విషయంలో మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టినా ఈసారి కూడా గట్టి టీఆర్పీనే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఈ సారి సీజన్లో మళ్ళీ ఆల్ టైం ఇండియన్ రికార్డు వస్తుందా లేదా అన్నది ఇంకొన్ని రోజులు ఆగి చూడాల్సిందే.

Exit mobile version