తెలుగు కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’. వైవా హర్ష, షైనింగ్ ఫణి, కేజీయఫ్ గరుడరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.జె.శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో రాజ్‌కుమార్ రావు ఒకరు. ఐతే, రాజ్‌కుమార్ రావు ‘బకాసుర రెస్టారెంట్’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. నిజానికి ఈ సినిమా తెలుగులో అంత గొప్ప ఆదరణకు నోచుకోలేదు. అలాంటి ఈ సినిమా రీమేక్ పై
రాజ్ కుమార్ రావు ఇంట్రెస్ట్ చూపించడం నిజంగా విశేషమే. అన్నట్టు ‘బకాసుర రెస్టారెంట్’ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోకపోయినా, ఓటీటీలో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఓటీటీ ప్రేక్షకులు నుంచి ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. బహుశా అందుకే, రాజ్ కుమార్ రావు ఈ సినిమా పై ఇంట్రెస్ట్ చూపించి ఉండొచ్చు.