‘డ్రాగన్’ స్పెషల్ సాంగ్‌లో యంగ్ బ్యూటీ.. నిజమేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇక ఈ సాంగ్‌లో ఏ హీరోయిన్‌ను తీసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో ఈ సాంగ్‌లో రష్మిక కనిపించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ సాంగ్‌లో యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ కేతిక శర్మను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘సింగిల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కేతిక, నిజంగానే ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే అది ఆమెకు బాగా కలిసొస్తుందని అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ సాంగ్‌లో కేతిక సర్‌ప్రైజ్ చేస్తుందా అనేది చూడాలి.

Exit mobile version