‘బైకర్’ వెనక్కి వెళ్తాడా..?

Biker

హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ బైక్ ఛేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం శర్వానంద్ గట్టిగా ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడు. కఠినమైన డైట్ వల్ల బాగా సన్నబడి కుర్రాడిలా కనిపించేలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.

అయితే, ఒక రోజు ముందు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. దీంతో అఖండ 2 తర్వాత రోజు రాబోయే బైకర్ గురించి ప్రేక్షకుల్లో బజ్ తక్కువగా ఉంది. మరి అఖండ 2 పై ఉన్న క్రేజ్ కారణంగా బైకర్ రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. కేవలం ఒక్కరోజు గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర పోటీకి శర్వా ధైర్యం చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీంతో బైకర్ చిత్రం రిలీజ్ వారం రోజులు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా నిజంగానే వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Exit mobile version