‘వార్-2’లో హృతిక్ కంటే తారక్‌కే ఎక్కువ..?

War2

బాలీవుడ్ ప్రెస్టీజియస్ స్సై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ

సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్‌ను స్టన్ చేసేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని.. ఇందులో ఎన్టీఆర్‌కు రూ.70 కోట్లు, హృతిక్ రోషన్‌కు రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వార్తతో హృతిక్ కంటూ కూడా తారక్‌కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version