టాలీవుడ్లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా చిత్రం ‘కన్నప్ప’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచి యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూన్ 27న వరల్డ్‌వైడ్ థియేటర్లలో రిలీజ్ అయిన ‘కన్నప్ప’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌ను జూలై 25 నుంచి చేసేందుకు వారు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో రెడీ అవుతోందట. మరి కన్నప్ప ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.