‘కూలీ’ కోసం మాట సాయం అందిస్తున్న లోకనాయకుడు..?

Coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా కోలీవుడ్ వర్గాల్లో మరో వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

కూలీ సినిమా కోసం మరో స్టార్ హీరో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్‌ను రిక్వెస్ట్ చేయడంతో, ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో కమల్‌తో లోకేష్ ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ కోరగానే కమల్ ఆయనకు ఓకే చెప్పాడట.

గతంలో కమల్, రజినీ కలిసి నటించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రజినీ సినిమాలో కమల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుందనే వార్తతో అభిమానుల్లో జోష్ నిండింది. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version