మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు

Mahesh-Babu-James-Cameroon

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర థండర్ రెస్పాన్స్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా విషయంలో జక్కన్న తనదైన స్ట్రాటెజీతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా షూటింగ్ జరుపుతున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను నవంబర్‌లో రిలీజ్ చేస్తామని ఇటీవల వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే, కేవలం ఫస్ట్ లుక్‌తోనే వరల్డ్‌వైడ్‌గా అంచనాలు పెంచుతూ పాత రికార్డులను పటాపంచలు చేయడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. మరి నిజంగానే అవతార్ చిత్ర దర్శకుడు SSMB29 కోసం వస్తాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version