అల్లు అర్జున్ కోసం ‘లైగర్’ బ్యూటీ.. వర్కవుట్ అయ్యేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే వారి గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ నటించబోతుందనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఇక మరో హీరోయిన్‌గా దీపికా పదుకొనే పేరు కూడా వినిపించింది. కానీ, దీపికా ఈ సినిమాలో నటించడం లేదని.. ఆమె ప్లేస్‌లో ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ఈ సినిమాలో అనన్య పాండే నటిస్తుందనే వార్త అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. లైగర్ మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా, సౌత్‌లో మాత్రం అమ్మడికి సరైన చిత్రం పడలేదు. మరి అల్లు అర్జున్ – అట్లీ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో ఆమెను ఎలాంటి పాత్ర కోసం తీసుకుంటున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version