‘అవెంజర్స్’ ని మించి వీడియో గేమ్ కి క్రేజ్.. యూట్యూబ్ లో హిస్టరీ

ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలు అలాగే వీడియో గేమ్స్ లాంటి వాటికి కూడా భాషా, ప్రాంత భేదాలు లేకుండా గట్టి రీచ్ ఉంటుంది. అలా మార్వెల్ సంస్థ అవెంజర్స్ సినిమాల సిరీస్ కి కూడా ఓ రేంజ్ లో రీచ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇలా అవెంజర్స్ సిరీస్ లో వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో ఒకటే “అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”. అయితే ఈ సినిమా ట్రైలర్ కి అప్పట్లో ఊహించని క్రేజ్ నెలకొంది.

ఎంతోమంది సూపర్ హీరోలు కలిసి కనిపించిన ఈ సినిమా తాలూకా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. మొదటి 24 గంటల్లోనే ఈ సినిమాకి ఏకంగా 240 మిలియన్ వ్యూస్ కి పైగా వస్తే ఇప్పుడు ఓ పాపులర్ వీడియో గేమ్ ట్రైలర్ దీన్ని బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ వీడియో గేమ్ నే జీటీఏ థెఫ్ట్ ఆటో 6. మన వాళ్ళకి బాగా అర్ధం కావాలి అంటే జీటీఏ వైస్ సిటీ అంటే తెలుస్తుంది.

ఈ గేమ్ లో ఆరవ ఇన్స్టాల్మెంట్ గా ఎన్నో ఏళ్ళు తర్వాత వస్తున్న గేమ్ కావడంతో దీనిపై ప్రపంచ ఆడియెన్స్ లో క్రేజీ హైప్ ఏర్పడింది. విడుదల చేసిన ట్రైలర్ కి కేవలం 24 గంటల్లోనే 269 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా ఎలాంటి యాడ్స్ లేకుండా అవెంజర్స్ తాలూకా లైఫ్ టైం వ్యూస్ ని ఈ సినిమా బ్రేక్ చేసిందట. సో ఈ గేమ్ కి ఉన్న క్రేజ్ ఆ సినిమా కంటే ఎక్కువే అని దీనితో అర్ధం అవుతుంది.

ఇలా యూట్యూబ్ హిస్టరీ లోనే ఒక ట్రైలర్ కి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రావడం హిస్టారికల్ గా మారింది. అయితే దీనికి ముందు ప్లేస్ లో మరో పాపులర్ గేమ్ సబ్ వే సర్ఫర్స్ ఉందట కానీ అది యాడ్స్ వల్ల వచ్చాయనే టాక్ ఉంది. సో ఆర్గానిక్ గా మాత్రం జీటీఏ థెఫ్ట్ ఆటో 6నే టాప్ లో నిలిచింది.

Exit mobile version