సెన్సార్ పూర్తి చేసుకున్న బిజినెస్ మేన్


ప్రిన్స్ మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెన్సార్ సభ్యలు ఈ చిత్రానికి గాను ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం జనవరి 11న భారీగా విడుదల కాబోతుంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుతో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేయబోతుంది. సినిమాలో వీరిద్దరి మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. భారీ అంచనాలున్న ఈ చిత్రం అత్యధిక ప్రింట్లతో విడుదలవుతుంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి.

ప్రత్యేక అప్డేట్స్ కోసం 123తెలుగు.కాం చూస్తూ ఉండండి.

Exit mobile version