బస్ స్టాప్ సెన్సార్ కష్టాలు

యువతని ఆకర్షించడానికి ‘ఈ రోజుల్లో’ సినిమా అంతా డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేసి ఆ సినిమా హిట్ కొట్టాడు దర్శకుడు మారుతి. తన తరువాత సినిమా ‘బస్ స్టాప్’ సినిమాకి కూడా అదే ట్రెండ్ ఫాలో అవలనుకున్నాడు. కానీ సెన్సార్ వాళ్ళు అయన జోరుకి బ్రేకులు వేసారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్ళిన ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు 40 కట్స్ పైనే చెప్పారు. అన్ని కట్స్ చేయడానికి అంగీకరించని చిత్ర బృందం రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. సినిమా మొత్తం చుసిన రివైజింగ్ కమిటీ మరో మూడు కట్స్ చేయాలనడంతో షాక్ తినడం వారి వంతైంది. మరి బస్ స్టాప్ వాళ్ళు ట్రిబ్యునల్ కి వెళ్తారో లేక కట్స్ కి అంగీకరిస్తారో వేచి చూడాలి.

Exit mobile version