స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హసన్ జంటగా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7ఎకర్స్ కాంప్లెక్స్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో బన్నీ- శృతి హసన్ పాల్గొంటున్నారు. ఈ సినిమా సెట్స్ ని ఈ రోజు అల్లు అరవింద్ విజిట్ చేశారు. బన్నీ యాక్షన్ ని కూడా చూడటం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. వక్కంత వంశీ స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన తరువాత హరీష్ శంకర్ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం.