థమన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ కు బన్నీ స్పెషల్ థాంక్స్.!

థమన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ కు బన్నీ స్పెషల్ థాంక్స్.!

Published on Jan 12, 2021 9:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” సెన్సేషన్ నేటికి ఏడాది పూర్తి కావడంతో ఈ చిత్ర యూనిట్ అంతా కలిసి మళ్ళీ ఆ 1 ఇయర్ సెలెబ్రేషన్స్ ను జరుపుకున్నారు. మరి ఈ సందర్భంగా బన్నీ ఇప్పటి వరకు తన జర్నీ కోసం కూడా చెప్పారు. తాను ఇలాంటి హిట్ కొట్టడానికి ఇన్నేళ్లు పట్టిందని ఇక నుంచి మరో లెవెల్లో ఉంటుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరి ఇన్నేళ్ల బన్నీ జర్నీపై మ్యూజిక్ సెన్సేషన్ థమన్ రెడీ చేసిన ఒక స్పెషల్ సాంగ్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు ఓ ఎమోషనల్ కిక్ ఇస్తుంది. బన్నీ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలను ఇందులో కవర్ చేసి ర్యాప్ సాంగ్ లా డిజైన్ చేశారు. ఇందులో లిరిక్స్ కానీ సాంగ్ బీట్స్ కానీ థమన్ సూపర్బ్ గా అరేంజ్ చేసాడు. మరి దీనితో తన జర్నీపై ఇంతటి అద్భుత పాటను అందించినందుకు థమన్ కు త్రివిక్రమ్ మరియు సింగర్ రోల్ రైడా కు తన సోషల్ మీడియా ద్వారా స్పెషల్ థాంక్స్ ను తెలిపారు.

తాజా వార్తలు