బన్నీకి అతడే కావాలంట.!

బన్నీకి అతడే కావాలంట.!

Published on Aug 20, 2012 11:30 AM IST


ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే చాలా మ్యూజికల్ హిట్స్ వచ్చాయి మరియు అదే కాంబినేషన్లో ఇటీవలే వచ్చిన ‘జులాయి’ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బన్ని తన రాబోయే సినిమాలకు దేవీ శ్రీ ని సంగీత దర్శకుడిగా తీసుకోమని సిఫార్సు చేస్తున్నాడు.

అల్లు అర్జున్ హీరోగా రానున్న తదుపరి చిత్రం ‘ఇద్దరు అమ్మాయిలతో’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. మొదట్లో ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రి ని తీసుకోవాలనుకున్నారు కానీ బన్ని మాత్రం దేవీ శ్రీ ని తీసుకోమని పట్టు బడుతున్నారంట. ఇప్పటివరకూ దేవీ శ్రీ పని చేసిన అందరి సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. ‘ఇద్దరు అమ్మాయిలతో’ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.

తాజా వార్తలు