‘ఇద్దరమ్మాయిలతో’ డబ్బింగ్ లో బిజీగా ఉన్న బన్ని

Allu-Arjun-in-Iddarammayila

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా డబ్బింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే చివరిలో ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. బ్రహ్మానందం, రావు రమేష్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని పూర్తిగా డిజిటల్ పరికరాలతో షూట్ చేశారు.

Exit mobile version