స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాలభామలు తాప్సీ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా తెరకెక్కనున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ ముగ్గురూ త్వరలోనే న్యూజీలాండ్ పయనమవనున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 1 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభం కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ స్టొరీ ఎక్కువ భాగం న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్ర టీం ఈ రెండు దేశాల్లో షెడ్యూల్స్ జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పూరి జగన్నాథ్ ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసారు మరియు ఈ చిత్ర చిత్రీకరణని చాలా వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని స్పెయిన్ లో షూట్ చేయ్యాలనుకున్నారు కానీ ఆ తర్వాత న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియాలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం ‘జులాయి’ తో హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే విజయపరంపరని ఈ సినిమాతో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారు.