అల్లరోడి సినిమాకి భారీ బుజినెస్

అల్లరోడి సినిమాకి భారీ బుజినెస్

Published on Nov 5, 2012 1:33 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ‘యముడికి మొగుడు’ సినిమా రైట్స్ అన్ని ఏరియాల్లోనూ భారీ మొతానికి అమ్ముడు పోతున్నాయి. అల్లరి నరేష్ కెరీర్లోనే ఏ సినిమా అమ్ముడుపోనంతగా ఈ చిత్ర కృష్ణా జిల్లా రైట్స్ సుమారు 60 లక్షలకి కొనుక్కున్నారని ఇది వరకే తెలిపాము. ‘సుడిగాడు’ సినిమా సూపర్ హిట్ అవడం మరియు మినిమం గ్యారంటీ హీరోగా అతనికి ఉన్న పేరు కారణంగా అల్లరి నరేష్ రాబోయే సినిమా యముడికి మొగుడు సినిమాకి అంత భారీ రేట్స్ పలుకుతున్నాయి.

రిచా పనాయ్ కథానాయికగా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో రమ్య కృష్ణ మరియు సాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోటి సంగీతం అందిస్తున్నారు. చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమా ఆడియోని నవంబర్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు