విడుదలకు సిద్ధమైన సూర్య ‘బ్రదర్స్’


సూర్య అవిభక్త కవలలుగా నటిస్తున్న బ్రదర్స్ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 12 భారీగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కె జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో కాజల్ హీరొయిన్ గా నటించింది. ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమాలో సూర్య ఒక పాత్రకి గాను సూర్య సోదరుడు కార్తి డబ్బింగ్ చెప్పాడు.

Exit mobile version