మనకు మరో బ్రోకర్

Posani-Krishna-Murali
ఆర్.పి పట్నాయక్ ప్రధాన పాత్రధారుడిగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘బ్రోకర్’ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బ్రోకర్ 2′ మన ముందుకు రాబోతుంది. పోసాని కృష్ణమురళి ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాని మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శనివారం ఉదయం లాంచనంగా ప్రారంభం అయ్యింది. “సమకాలిన రాజకీయ వ్యవస్థలో ఒక దళారి ఆడిన మైండ్ గేమ్ నేపధ్యంలో సాగే కధ ఇది. భావోద్వేగాలకు, వినోదానికి ఆస్కారం ఉందని” పోసాని తెలిపారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి బి. గోపాల్, వి.వి వినాయక్ హాజరయ్యారు.

Exit mobile version