బ్రేకింగ్ – అరెస్టయిన రియా చక్రవర్తి.!

ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా రియా చక్రవర్తి పేరు ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన దగ్గర నుంచి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె న్యాయం కోసం పోరాడుతుంది. ఒక పక్క ఈమెకు సపోర్ట్ చేసే వారూ ఉన్నారు అలాగే వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు.

అయితే ఈ కేసుతో పాటుగా ఈమె పై ఓ డ్రగ్స్ కేసు కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఈ కేసుకు సంబంధించి ఈమె అరెస్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో గత నాలుగు రోజుల నుంచి విచారించిన అనంతరం ఎన్ సి బి వారు ఆమెను ఇపుడు అరెస్ట్ చేసారు. ఇదిలా ఉండగా ఈ ఇంట్రాగేషన్ లో రియా పలువురు ప్రముఖ వ్యక్తులకు కూడా సంబంధం ఉన్నట్టుగా తెలిపినట్టు తెలుస్తుంది.

Exit mobile version