తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం బాలీవుడ్ లో ఒక పెద్ద సినిమాలో నటించనున్నాడు
మీడియా కధనాల ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ అనీస్ బజ్నీ మరియు బ్రహ్మానందం హైదరాబాద్ లో చర్చలు జరిపారు. ‘వెల్కమ్ బ్యాక్’ అనే సినిమాలో అతని పాత్ర కోసం ఈ చర్చలు సాగాయట
ఈ వార్త ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఇదే గనుక నిజమైతే ఇప్పటికే తారాస్థాయిలో సాగుతున్న బ్రహ్మీ కెరీర్ కు మరో కొత్త బీజం పడినట్టు అవుతుంది. ఈ వార్త ఎంతవరకూ నిజమో చూడాలి