మామకు పోటీగా అల్లుడు దిగాడు.

ఈ ఏడాది సంక్రాంతికి రజిని అందిరి కంటే ముందే దర్బార్ మూవీతో దిగారు. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు మరియు తమిళ్, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లనే దక్కించుకుంది. ముఖ్యంగా తమిళంలో రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. కాగా మామ రజిని కి పోటీగా అల్లుడు ధనుష్ నేడు దిగాడు. ఆయన నటించిన పటాస్ మూవీ విడుదల అవుతుంది.

పటాస్ మూవీలో ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ధనుష్ పటాస్ చిత్రంలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. తండ్రి పాత్రకు హీరోయిన్ గా స్నేహ నటించగా, కొడుకు పాత్రకు జంటగా మెహ్రిన్ నటించారు. ఒక విధంగా చెప్పాలంటే, స్నేహ, మెహ్రీన్ అత్తా కోడళ్ళుగా నటించారన్న మాట. కాగా రజిని దర్బార్, ధనుష్ పటాస్ బాక్సాపీస్ వద్ద నేటి నుండి పోటీపడనున్నారు. దీంతో మామ అల్లుళ్ళ పోరు రసవత్తరంగా మారింది.

Exit mobile version