పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని సంపత్ నంది డైరెక్ట్ చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ పనుల్లో బాగా చురుకుగా పాల్గొంటారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబందించిన ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రొడక్షన్ యూనిట్ షూటింగ్ సమయంలో మళ్ళీ ఎలాంటి అడ్డంకులు, స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లనున్నారు.
శరత్ మరార్ నిర్మిస్తున్న గబ్బర్ సింగ్ 2 లో పవన్ కళ్యాణ్ సరసన ఒక కొత్త హీరోయిన్ జోడీగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సూపర్బ్ ఫాంలో ఉన్నారు, అదీకాక ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ‘గబ్బర్ సింగ్ 2’ పై భారీ అంచనాలున్నాయి.