మున్నాభాయ్ ఎమ్బీబీఎస్, 3 ఇడియట్స్ లాంటి సినిమాలతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు అయిన హిందీ నటుడు బోమన్ ఇరానీ త్వరలో తెలుగులో ఒక సినిమాలో నటించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ద్వారా బోమన్ ఇరానీ తెలుగు తెర పై తెరంగ్రేటం చేయనున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫామిలీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ భాధ్యతలు చూసుకుంటున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది.