మన భారతదేశ సినీ చరిత్రలోనే “బాహుబలి” సినిమా ఎన్ని తారలు అయినా సరే చిరస్థాయిగా నిలిచిపోయే పేరును ఏర్పర్చుకుంది. ప్రభాస్ మరియు రాజమౌళిలు ఈ సిరీస్ ను ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన వారయ్యారు. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రాలు కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశ అన్ని భాషల్లోనూ ఆల్ టైం రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది.
బాహుబలి 2 అయితే 1 కంటే కూడా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం బాలీవుడ్ జనం అని కూడా చెప్పాలి. అక్కడి ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఓన్ చేసుకున్నారో మరోసారి ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలు పెట్టినప్పటికీ కూడా అక్కడ బాహుబలి 2 సినిమా డామినేషన్ మామూలు రేంజ్ లో లేదు.
గత సెప్టెంబర్ నాలుగో వారపు స్లాట్ లో టెలికాస్ట్ చేసిన బాహుబలి 2 కు భారీ స్థాయిలో 55 లక్షల దగ్గరకు వ్యూవర్ షిప్స్ తో హిందీలో టాప్ 5 ప్రోగ్రామ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది ఈసారి మాత్రమే కాదు అక్కడ టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి రిపీట్ అవుతుంది. మరి ఈ రేంజ్ లో ప్రభాస్ సినిమాను ఆదరిస్తున్నారంటే వారికి ఏ స్థాయిలో ఈ సినిమా నచ్చి ఉండాలి. అందుకే ప్రభాస్ క్రేజ్ అక్కడ చెక్కు చెదరక పోగా మరింత స్థాయిలో పెరుగుతుంది.