రాజమౌళి పై కన్నేసిన బాలీవుడ్ హీరో

ఈ మధ్య సౌత్ ఇండియన్ సినిమాలను రీమేక్ చేసి బాలీవుడ్ హీరోలు వరుస హిట్స్ కొడుతున్నారు. అందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. తను హీరోగా నటించిన ‘కిలాడి 786’ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ ‘ కిలాడి 786 సినిమా కొత్తగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. నేను చేసిన సినిమాల్లో సౌత్ ఇండియన్ రీమేక్ సినిమాలే ఎక్కువ. ఇక్కడి డైరెక్టర్స్ చాలా టాలెంట్ ఉన్నవారు అందుకే ఈ మధ్య ఇక్కడి సినిమాలపై దృష్టి పెడుతున్నాను. అన్నీ కుదిరితే నాకు రాజమౌళి డైరెక్షన్లో నటించాలని ఉంది. అది జరుగుతుందో లేదో నాకు తెలియదని’ అన్నాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే రాజమౌళి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని ఉందని అన్నారు. ఒకవేళ రాజమౌళి బాలీవుడ్ లో సినిమా చేస్తే అక్షయ్ తో కూడా సినిమా చేస్తారేమో? వేచి చూడాలి మరి.

Exit mobile version