నెగిటివ్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ ?

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి కూడా నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లు నేచురల్ స్టార్ నాని కూడా విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు.

మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌ లో ఆవిష్క‌రిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో స‌మ్మోహ‌నం వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు. హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రానుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version