హైదరాబాదులో బాలీవుడ్ చిత్ర పాటలు విడుదల

హైదరాబాదులో బాలీవుడ్ చిత్ర పాటలు విడుదల

Published on Feb 2, 2013 10:12 AM IST

Zilla-gaziabad
సంజయ్ దత్, అర్షద్ వార్సి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిల్లా ఘజియాబాద్’ చిత్ర ఆడియో హైదరబాదులో విడుదల చేసారు. టాలీవుడ్ హాట్ హీరోయిన్ ఛార్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రియ ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వినోద్ బచ్చన్ నిర్మించారు. అంజాద్ నదీమ్ సంగీతం అందించిన ఆడియో విడుదల వేడుకలో సంజయ్ దత్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రీతం సింగ్ అనే పోలీస్ అధికారి పాత్రా చేస్తున్నానని దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ చిన్న దబాంగ్ అయితే జిల్లా ఘజియాబాద్ సినిమాలో తాను పెద్ద దబాంగ్ అని అన్నారు. జిల్లా ఘజియాబాద్ సినిమాలో ఛార్మి, శ్రియ లాంటి వారు ఉండటంతో తెలుగు ప్రమోషన్లో భాగంగా వారు ఇక్కడికి వచ్చారు.

తాజా వార్తలు