బాలీవుడ్లో విజయం సాదించిన ‘బోల్ బచ్చన్’ తెలుగు రీమేక్ మరికొన్ని వారాలలో మొదలుకానుంది. అక్కడ అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కనిపించిన పాత్రలలో తెలుగులో మొదటిసారిగా విక్టరీ వెంకటేష్, రామ్ కలిసి నటించనున్నారు. విజయ్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరువాత వెంకటేష్, విజయ భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది.
ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరి సరసన కనిపించనున్న హీరొయిన్స్ మరియు మిగిలిన తారల వివరాలు త్వరలోన్వే వెల్లడిస్తారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సినిమా మర్చి 13న లాంచ్ చేసి, మర్చి 22నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారట. ఈ సినిమాకి తెలుగు టైటిల్ ఇంకా ఖరారు చెయ్యలేదు. ఈ రీమేక్ కాకుండా వెంకటేష్, రామ్ మరో సినిమాని అంగీకరించలేదు.