అభిమానులకు రామ్ చరణ్ బర్త్ డే కానుక ఇదే.!

అభిమానులకు రామ్ చరణ్ బర్త్ డే కానుక ఇదే.!

Published on Feb 21, 2014 2:32 PM IST

Ram-CHaran

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ కాంత్, రాజ్ కిరణ్ లు నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామేశ్వరంలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న రిలీజ్ చేయనున్నారు.

రామేశ్వరం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి షెడ్యూల్స్ పొల్లాచ్చి, నాగేర్కిల్ ప్రాంతాల్లో చేస్తారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్ కి జోడీగా కమలినీ ముఖర్జీ కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

తాజా వార్తలు