మెగాస్టార్ చిరంజీవి బయోగ్రఫీ ఒకటి ఈరోజు విడుదల అయ్యింది. ప్రముఖ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన ఈ పుస్తకానికి “మెగా చిరంజీవితం” అనే పేరు పెట్టారు. నాలుగు దశాబ్దాలుగా పసుపులేటి రామారావు జర్నలిస్ట్ గా సేవలందిస్తున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అయన చిరంజీవిని చేసిన మొదటి ఇంటర్వ్యూ ని స్మరించుకున్నారు. యముడికి మొగుడు చిత్రం నుండి ఆయనతో మరియు అయన కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలిపారు. చిరంజీవి గురించి మరియు అయన సినిమా ప్రస్థానం గురించి తెలుసుకోవలనుకునే వారికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. గతంలో ఆటో బయోగ్రఫీ వ్రాయమని కోరినా అయన తిరస్కరించారని రామ్ చరణ్ చెప్పారు.