‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ బ్లాస్ట్.. భారీ తెరపై డేట్ ఫిక్స్

sambarala

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే మంచి బజ్ ని అందుకున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే మరి గ్లింప్స్ ని వదులుతున్నట్టుగా టీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు అందించారు. దీనితో ఈ అక్టోబర్ 15న అసుర ఆగమనం అంటూ భారీ తెరపై విడుదలకి డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు.

దర్శకుడు రోహిత్ కే పి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాలూకా సాలిడ్ గ్లింప్స్ ని ఫేమస్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో భారీ తెర పీ సి ఎక్స్ (PCX) లో ఈ అక్టోబర్ 15న ఉదయం 10 గంటలకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా కొత్త గ్లింప్స్ పై మరింత బజ్ ఇపుడు సెట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి కూడా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version