ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి భారీ కాంబినేషన్ లు సెట్టవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీ హీరోలు, దర్శకులు కలిసి పని చేస్తున్నారు. ఇక ఇలానే ఓ క్రేజీ కాంబినేషన్ లాక్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషనల్ హీరోలు షారుఖ్ ఖాన్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్జ్ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ భారీ కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ ఉందట. అలాగే వీరిద్దరి కలయికలో తెలుగు నుంచి కాదు హిందీ నుంచి కాదు సౌత్ నుంచి మరో భాష దర్శకుడు వర్క్ చేయనున్నట్టు ఫ్రెష్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి.