ప్రస్తుతం మంచి రసవత్తరంగా నడుస్తున్న బిగ్ బాస్ 4 తెలుగు సీజన్లో మిగిలి ఉన్న కాస్త మంది కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ కు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో అభిజీత్ కూడా ఉంటాడని చెప్పాలి. తనదైన ఆటతో డీసెంట్ గా కొనసాగుతున్నాడు. అయితే ప్రతీసారి ప్రతీ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ కు ఒక యూనిక్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.
అలా ఈసారి అభిజీత్ కు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే అభిమానించే వారు ఉన్నారు. అలాగే మరికొంతమంది స్మాల్ స్క్రీన్ ప్రముఖులు కూడా అభిజీత్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అభిజీత్ కు ఏ రేంజ్ లో ఓటింగ్స్ పడుతున్నాయో అన్నది పక్కన పెడితే స్టార్ మా వారి సోషల్ మీడియాకు అభి ఫాలోవర్స్ యూనానిమస్ రెస్పాన్స్ తో షాకిచ్చారు.
ఎలాగో డేస్ పెరుగుతుండడంతో షో పట్ల ప్రేక్షకులకు స్టార్ మా వారు సోషల్ మీడియా ద్వారా మరింత చేరువవుతున్నారు. అలా లేటెస్ట్ గా ఆడియెన్స్ ను వారికి నచ్చిన రాజు/రాణి ఎవరు అని అడిగితే అభిజీత్ పేరిటే ఊహించని రెస్పాన్స్ ను అందించారు. బహుశా 90 శాతానికి పైగా అభికే తమ ఓట్ ను డిక్లేర్ చేసేసారు. అయితే వీరి ముగ్గురులో కాబట్టి అభికి గట్టిగానే సపోర్ట్ వచ్చింది.
ఒకవేళ హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి అఖిల్ ఫైనల్స్ టికెట్ లేకుండా ఈ రేస్ లో ఉంటే ఆడియెన్స్ స్పందన వేరేలా ఉండేది అని చెప్పొచ్చు. వీరిలో మాత్రం అభిజీత్ కు యూనానిమస్ రెస్పాన్స్ ను అందించారు. మరి చివరి వరకు అభిజీత్ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ అభిజీత్ విషయంలో నెటిజన్స్ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి అంటే ఈ కింది పోస్ట్ లోని కామెంట్స్ చూసి తెలుసుకోవచ్చు.
Miku nachina Raju/Rani evaro comment cheyandi#BiggBossTelugu4 today at 10 PM on @StarMaa pic.twitter.com/nrvKQZdpVx
— Starmaa (@StarMaa) December 8, 2020