‘పెద్ది’కి అక్కడ గట్టి పోటీ తప్పేలా లేదుగా..!

Peddi

ఆర్‌ఆర్‌ఆర్ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మార్చి 27 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. గేమ్ చేంజర్ నిరాశపరిచినా, ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై నార్త్ ఇండియాలో మంచి బజ్ ఉంది. ఇదే సమయంలో మార్చి 26న రావాల్సిన ‘ప్యారడైజ్’ షూట్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడే అవకాశం ఉంది.

హిందీ మార్కెట్‌లో పెద్దికి ఢీ కొట్టే సినిమాలు లేకపోయినా, యశ్ ‘టాక్సిక్’, అజయ్ దేవగన్ ‘ధమాల్ 4’, రణవీర్ సింగ్ ధురంధర్ 2 చిత్రాలు మార్చి 19న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో ఏదైనా భారీ హిట్ అయితే, నార్త్‌లో పెద్ది ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా ‘టాక్సిక్’ క్రేజ్ ఉన్న క్రేజ్ గమనించదగ్గది.

అయితే ‘చికిరి చికిరి’ సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పెద్దిపై అంచనాలు మరింత పెరిగాయి. జాన్వీ కపూర్ జోడీగా నటించడం, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించడం కూడా హైప్‌ను పెంచుతున్నాయి. మరి హిందీలో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version