కింగ్ నాగార్జున హోస్ట్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 సూపర్ హిట్. 100 ఎపిసోడ్స్ కి పైగా రసవత్తరంగా సాగిన ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. రాహుల్, సిప్లిగంజ్, శ్రీముఖి ఫైనల్ కి చేరగా ఉత్కంఠ పోరులో స్వల్ప ఓట్ల తేడాతో రాహుల్ టైటిల్ గెలవడం జరిగింది. ఐతే ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వారిలో హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు జంట ప్రత్యేకంగా నిలిచింది.
మొదటిసారి తెలుగు బిగ్ బాస్ షో లో ఒక మారీడ్ కపుల్ కి అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ఈ కపుల్ మధ్య రొమాన్స్, గిల్లి కజ్జాలు, కోపతాపాలు షోలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. దాదాపు సీజన్ చివరి వరకు ఈ జంట కొనగడం జరిగింది. వరుణ్ సందేశ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ షో తరువాత వితిక మంచి పాపులారిటీ వచ్చింది. ఈమె తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఫోటోలు వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. ఇక నేడు ఆమె ఆవకాయ్ చేస్తున ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.