సాహసం మూవీపై బిగ్ బడ్జెట్

సాహసం మూవీపై బిగ్ బడ్జెట్

Published on Jun 12, 2013 12:38 PM IST

Sahasam Budget

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సాహసం’. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాపై బిగ్ బెట్టింగ్ జరిగింది. ఆడేటి సినిమాకి కూడా బెట్టింగ్ జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోతున్నారా, మేము ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ టీం పెట్టిన బడ్జెట్ గురించి చెబుతున్నాం.

ఈ సినిమా కోసం నిర్మాత దాదాపుగా రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో నటిస్తున్న నటి నటుల పరంగా చూస్తే ఇది చాలా పెద్ద రిస్క్. కానీ నిర్మాత కథ మీద నమ్మకం ఉండడంతో ఇంత రిస్క్ చేసాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అతను తను పెట్టిన బెట్టింగ్ కి తగిన ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాడు. గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్యాం దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

తాజా వార్తలు