పూరి నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్

దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘పూరిసేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదిలా ఉండగా, పూరి తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడని.. దీనికోసం ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై పూరి టీమ్ క్లారిటీ ఇచ్చారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం పూర్తిగా తన కొత్త ప్రాజెక్ట్ పూరిసేతుపతి పైనే దృష్టి పెట్టారు. ఆయన ఇతర ప్రాజెక్టులపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధాలు. ఇలాంటి పుకార్లను నమ్మకండి, వ్యాప్తి చేయకండి. పూరి జగన్నాథ్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్‌ను మేమే ప్రకటిస్తామంటూ పూరి టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version