టాలీవుడ్ మిస్సమ్మ భూమిక నటించిన సినిమాలు గత కొద్ది కాలంగా పెద్దగా విజయాన్ని సాదించడం లేదు. భూమిక యోగ గురు భారత్ ఠాకూర్ ని వివాహం చేసుకున్న తరువాత తను సినిమాలు నటించడం తగ్గించింది. కానీ మళ్ళి తను తిరిగి సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తోంది. ఈ మద్య తను నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఆహించినంత విజయాన్ని సాదించలేదు. కానీ తను మాత్రం తన ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తను నటించిన ‘ఏప్రిల్ ఫూల్’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా నటించాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు గుల్షన్ గ్రోవేర్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. శ్రీకాంత్ ల్యెంగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాపై భూమిక చాలా నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదిస్తోందో లేదో చూడాలి.