మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో నడిచిన భీష్మ రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్ లోనే మంచి విజయాన్ని సాధించింది. కాగా కృష్ణా జిల్లాలో పదో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. పది రోజున భీష్మ కృష్ణాలో రూ. 11,03,137 షేర్ ను రాబట్టింది. మొత్తం 10 రోజుల్లో 1,55,15,518 షేర్ ను రాబట్టింది. మొత్తానికి కృష్ణాలో భీష్మ బాగానే రాబడుతున్నాడు.
దీంతో బ్రేక్ ఈవెన్ కు చేరువై మంచి లాభాలను సాధించింది ఈ చిత్రం. ఈ సందర్బంగా టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లోని గురజాడ కళా క్షేత్రంలో జరగనున్న ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరుఅయ్యారు. ఈ విజయంతో వరుసగా పరాజయాలు చవిచూసిన నితిన్ కెరీర్ గాడిలో పడ్డట్లైంది. డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఈ విజయంతో హాట్ షాట్ అయ్యారు. ఇక రష్మిక మందన్నకు ఈ 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’తో కలిపి ఇది రెండో విజయం.