రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన ‘భీమనేని శ్రీనివాసరావు’ సుడిగాడు చిత్రంతో మరోమారు సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలై తమిళంలో విజయం సాధించిన ‘సుందర పాండ్యన్’ రీమేక్ హక్కుల గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు భీమనేని. ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రంను తమిళంలో దర్శకుడు మరియు హీరో అయిన శశి కుమార్ నటించగా, ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ ‘సుందర పాండ్యన్’ను తెరకెక్కించారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్లో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటించనున్నారు అనే విషయాల్ని త్వరలోనే తెలియజేయనున్నారు.