కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించనున్న కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం లొకేషన్స్ చూడటానికి ఈ చిత్ర టీం ఈ రోజు బ్యాంకాక్ వెళ్తున్నారు. పూలరంగడుతో హిట్ కొట్టిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. ఈ మూవీ టీం పాత సినిమాల్లో వాడిన లొకేషన్స్ ఏమీ లేకుండా చాలా ఫ్రెష్ ఫీల్ కావాలని కొత్త లొకేషన్స్ కోసం వెతుకుతున్నారు. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. గతంలో నాగ్ హీరోగా వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా లాగానే ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ లాంటి రెండు కామెడీ సినిమాలతో సక్సెస్ అందుకున్న వీరభద్రం మళ్ళీ అదే ఫార్ములాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని ప్రత్నిస్తున్నాడు.