‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓల్డ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం స్పెషల్ సెట్ ను వేయటం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ఈ నెల చివరి వరకు ముగుస్తుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ ప్రదానం కానుందని సమాచారం. నాగార్జున ఈ సినిమా ‘హలో బ్రదర్’ సినిమాలా మంచి హిట్ సాదిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ చూస్తుంటే ఈ సినిమా కథ మాఫియ బ్యాక్ డ్రాప్ లో వుండనుందని అనిపిస్తుంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వీరభద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సమీర్ రెడ్డి కెమెరామాన్ గా పనిచేస్తున్నాడు.