నెలాఖరున ఆఖరిసారిగా చిందేయనున్న భాయ్

Bhai
కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది. నాగార్జున, రీచా నడుమ ఒక్క పాత మినహా మిగిలిన చిత్రీకరణ ముగిసింది. ఈ పాటను ఈ నెల చివరనుండి తెరకెక్కించనున్నారు. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సహచర్యంతో ఈ సినిమాను నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు

ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఆగష్టు 10న విడుదలకానుంది. ముందుగా చిత్రబృందం ఆగష్టు 9నే ఫస్ట్ లుక్ విడుదలచేద్దామనుకున్నా అది ఒకరోజుకి వాయిదాపడింది. ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

‘భాయ్’ సినిమా కామెడీ, సెంటిమెంట్ మేళవించిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది

Exit mobile version