అంచనాల నడుమ విడుదలకానున్న భద్రమ్

అంచనాల నడుమ విడుదలకానున్న భద్రమ్

Published on Mar 18, 2014 3:27 AM IST

bhadram1
అశోక్ సెల్వన్, జనని ఐయెర్ జంటగా నటించిన భద్రమ్ ఈనెల 21న విడుదలకానుంది. పి రమేష్ తెరకెక్కించిన ఈ తెగిడి తమిళ మాతృకకు తెలుగు వెర్షన్ ను గుడ్ ఫ్రెండ్స్ మరియు శ్రేయాస్ మీడియా బ్యానర్ పై బి రామాకృష్ణ రెడ్డి. ఉమాదేవి సహనిర్మాత

తమిళ వెర్షన్ అన్ని విధాలా విజయం సాధించడంతో తెలుగులో కూడా విజయం ఖాయమనే అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడమే కాక సినిమాపై ఆసక్తిని కుడా పెంచింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చుసిన ప్రముఖులు ఈ సినిమాకు నటీనటుల నటన, స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట

ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ గా రూపుదిద్దుకుంది. డిటెక్టివ్ కావాలనుకున్న ఒక కాలేజి విద్యార్ది చుట్టూ తిరిగే కధ ఇది. నివాస్ కె ప్రసన్న సంగీత దర్శకుడు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు