సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం భద్రాచలం సెట్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం భద్రాచలం సెట్

Published on Nov 11, 2012 8:50 PM IST

మహేష్ మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది సమంత మరియు అంజలి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం సెట్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. చిత్రంలో చాలా భాగం వరకు చిత్రీకరణ పూర్తయిపోయింది డిసెంబర్ మొదటి వారంలో మహేష్ బాబు మరియు సమంతల మధ్య ఒక పాటను చిత్రీకరించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు అన్నదమ్ముల పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాత ధీమాగా ఉన్నారు.కే వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు