బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వర్మ సినిమా.!

RGV
ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో వివాదాస్పదమైన సినిమా ‘ది అటాక్స్ అఫ్ 26/11(తెలుగులో – 26/11 ఇండియా పై దాడి)’. ఈ సినిమా 2013 మార్చి 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ దుమారం రేపుతున్న ఈ సినిమా అరుదైన గౌరవాన్ని అందుకుంది. అదేమిటంటే ఈ సినిమాని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఇది విన్న ఈ చిత్ర నిర్మాత పరాగ్ సంఘ్వీ సంతోషంతో ‘ రాము నిర్మించిన ఈ సినిమా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపిక కావడం ఎంతో ఆనందంగాను, గౌరవంగాను ఉంది. అలాగే ఈ సినిమా పనోరమ మరియు కాంపిటీషన్ విభాగాల్లో ఎంపిక కావడం, అలాగే ఈ కార్యక్రమానికి రమ్మని ఇన్విటేషన్ రావడం చాలా సంతోషంగా ఉందని’ అన్నారు. ఈ సినిమాలో నానా పటేకర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Exit mobile version